Ram Gopal Varma Reaction on Case : 'మర్డర్' మూవీ పోలీస్ కేసుపై రామ్ గోపాల్ వర్మ రియాక్షన్ ఇది!

Ram Gopal Varma Reaction on Case : లాక్ డౌన్ సమయంలో అందరూ సినిమాలకి దూరంగా ఉంటే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాడు

Update: 2020-07-05 08:01 GMT

Ram Gopal Varma Reaction on Case : లాక్ డౌన్ సమయంలో అందరూ సినిమాలకి దూరంగా ఉంటే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాడు. లాక్ డౌన్ సమయంలో వరుసపెట్టి సినిమాలను చేస్తున్నాడు. ఇప్పటికే నగ్నం, క్లైమాక్స్ అనే సినిమాలను 'ఆర్జీవీ వరల్డ్ - శ్రేయాస్ ఈటీ'లో రిలీజ్ చేసిన వర్మ తాజాగా మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అమృత, ప్రణయ్ ల ప్రేమ కథ ఆధారంగా వర్మ 'మర్డర్' అనే సినిమా చేస్తున్నట్టుగా ఇటివల ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని జూన్ 21న ఫాదర్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన వర్మ .. సినిమా పైన పెద్ద హైప్ క్రియేట్ చేశాడు. అయితే దీనిపైన అమృత ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ లేఖను కూడా రిలీజ్ చేసింది.

తాజాగా ఈ సినిమాపై ప్రణయ్ కుటుంబ సభ్యుల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వర్మ తెరకెక్కించే ఈ సినిమాలో తన కొడుకు హత్య కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ ప్రణయ్ తండ్రి బాలస్వామి నల్గొండలోని ఎస్సీ ఎస్టీ కోర్టుల ఫిర్యాదు దాఖలు చేశాడు. అయితే దీనిపైన స్పందించిన ఎస్సీ ఎస్టీ కోర్టు రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులను ఆదేశించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు మిర్యాలగూడ పోలీసు స్టేషన్లో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది.

అయితే తాజాగా దీనిపైన వర్మ స్పందించాడు.. "ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోంది తప్ప వాస్తవం కాదు. అదేవిధంగా ఏ ఒక్క కుల ప్రస్తావనను ఈ సినిమాలో తీసుకురాలేదు" అంటూ వర్మ ఓ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా "ఈ మూవీ గురించి తెలుసుకోకుండా కేసు ఫైల్ చేశారు. అయితే ఆ కేసు విషయమై మా న్యాయవాదులు న్యాయ ప్రకారం తగిన సమాధానం ఇస్తారు" అంటూ వర్మ పేర్కొన్నాడు

Tags:    

Similar News