TS Weather Report Today: ఇవాళ, రేపు తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు
TS Weather Report Today: ఆదివారం పలు ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు ...
TS Weather Report Today: ఆగ్నేయ భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. వాయువ్య భారత ప్రాంత వాతావరణంలో నెలకొన్న అస్థిరత ప్రభావంతో ఇవాళ, రేపు రాష‌్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఆదివారం ఉదయం 8గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలు ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు కురిశాయి.
అత్యధికంగా బరంపూర్2.2, దస్తురాబాద్‌లో 1.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉష్ణోగ్రత సాధారణం కన్నా 3 డిగ్రీల వరకు పెరగడంతో చలి తీవ్రత కొంత తగ్గింది. ఆదివారం తెల్లవారుజామున అత్యల్పంగా తాళ్లపల్లిలో 15.03 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. గాలిలో తేమ సాధారణం కన్నా ఎక్కువగా ఉంటోంది. ఉదయం పూట దట్టంగా పొగమంచు కురుస్తోంది.