Hyderabad: ఆర్టీసీ బస్సులో సందడి చేసిన రాహుల్, సీఎం రేవంత్..
Hyderabad: ప్రయాణికులకు కాంగ్రెస్ పాంచ్ న్యాయకరపత్రాలు అందించిన రాహుల్
Hyderabad: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ సిటీ బస్సులో సందడి చేశారు. సరూర్ నగర్ జనజాతర సభలో పాల్గొన్న అనంతరం తిరుగు ప్రయాణంలో దిల్ షుక్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి సిటీ బస్సు ఎక్కారు. బస్సులో ప్రయాణికులకు కాంగ్రెస్ పాంచ్ న్యాయ కరపత్రాలు అందించారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు.