Rachakonda Police: రాచకొండలో దుమ్ము రేపుతున్న మహిళా పోలీసులు

Rachakonda Police: రాచకొండ లేడీ ఖాకీలు దుమ్ము రేపుతున్నారు. లాఠీ ఝుళిపించడమే కాదు స్టీరింగ్‌తో రప్ఫాడిస్తున్నారు.

Update: 2021-11-29 06:56 GMT

Rachakonda Police: రాచకొండలో దుమ్ము రేపుతున్న మహిళా పోలీసులు 

Rachakonda Police: రాచకొండ లేడీ ఖాకీలు దుమ్ము రేపుతున్నారు. లాఠీ ఝుళిపించడమే కాదు స్టీరింగ్‌తో రప్ఫాడిస్తున్నారు. మొదటిసారి పోలీస్ ట్రాన్సపోర్ట్ ఆర్గనైజేషన్‌లో తమ సత్తా చాటుతున్నారు. చేజింగ్‌లు, ట్రాకింగ్‌లతో కాన్వాయిని రయ్ మనిపించడమే కాదు ఇకపై అన్ని రిపేర్లూ చేస్తామంటున్న రాచకొండ లేడీ ఖాకీలపై హెచ్ఎం టీవీ స్పెషల్ స్టోరి.

తెలంగాణ పోలీసులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సిద్దం చేస్తోంది. ముఖ్యంగా మహిళా పోలీసులను పురుషులకు ధీటుగా తీర్చి దిద్దుతుంది. ఇప్పటికే నేరాల నియంత్రణ, కేసులు ఛేదించడం, నేరస్తులకు శిక్షలు పడేలా ఆధారాలు సేకరించడంలో మహిళా పోలీసులు ఆరితేరిపోతున్నారు. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో రోడ్లపై ట్రాఫిక్ చక్కదిద్దటంలో విధులు నిర్వహించి ప్రశంసలు పొందుతున్నారు.

నేరస్తులను పట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధునాతన వాహనాలను సమకూర్చింది. ఈ వాహానాలను ఇప్పటివరకూ పురుషులే నడపడం పరిపాటిగా సాగింది. అయితే ఇప్పుడు ఉమన్ సేప్టీ వింగ్‌లో భాగంగా మహిళా సిబ్బందిని సైతం ఇందుకు సిద్దం చేస్తున్నారు. ఇందు కోసం రాచకొండ కమిషరేట్ పరిధిలో 16 మంది మహిళా పోలీసులు ముందుకు వచ్చారు.

నగరంలోని మహళలు నిత్యం ఏదో ఒక సమస్య ఎదుర్కొంటున్నారు. మహిళల ఫిర్యాదులపై పోలీసులు ఘటనాస్థలానికి వెళితే సమస్య వినేందుకు పురుషుల కంటే మహిళలు ఉంటే బాగుంటుందని రాచకొండ సీపీ మహేష్ భగవత్ భావించారు. ఇందు కోసం కమీషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో గస్తీ నిర్వహించే మహిళా అధికారులకు డ్రైవింగ్ చేసే మహిళా సిబ్బంది ఉండాలని వీరికి ప్రత్యేక శిక్షణ అందించారు.

ప్రత్యేక శిక్షణ తీసుకున్న 16 మంది మహిళా పోలీసుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. ఎండైనా, వానైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాహనాన్ని నడపగల ఆత్మవిశ్వాసం తమకు ఉందని చెబుతున్నారు. ఈ శిక్షణ వ్యక్తిగత జీవితంలోనూ ఎంతో ఉపయోగపడుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వాహనం గురించి ఎటువంటి అవగాహన లేకపోయినా ఇప్పుడు వెహికిల్ మేనేజ్‌మెంట్ చేయడంలో లేడీ పోలీసులు నైపుణ్యత సాధించారని పోలీస్ ట్రాన్పోర్ అధికారి విజయ్ అంటున్నారు. పోలీసు ట్రాన్పోర్ట్ కార్యాలయంలో ఉన్న ప్రత్యేక శిక్షణా విభాగంలో వీరికి శిక్షణ అందించామన్నారు. మొత్తంగా పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా మహిళా పోలీసులు రాణించడం ఓ మంచి శుభపరిణామమనే చెప్పాలి.

Full View


Tags:    

Similar News