ఖమ్మంలో చిన్న ఘటనను రాద్ధాంతం చేస్తున్నారు - మంత్రి పువ్వాడ
Puvvada Ajay Kumar: కొంతమంది సూడో చౌదరీలు వారితో చేతులు కలిపారు - పువ్వాడ
Puvvada Ajay Kumar: రెండు రాష్ట్ర రాజకీయాల్లో కమ్మ సామాజికవర్గానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అటు రాజకీయంగంలోనైనా, ఇటు వ్యాపారపరంగంలోనైనా ఆ సామాజికవర్గం ఎంతో ప్రత్యేకమైనది... తెలుగు రాష్ట్రాల్లో ఎందరో ప్రతిష్టాత్మక నేతలు కమ్మ సామాజికవర్గం నుంచి వచ్చి కీలక బాధ్యతలు చేపట్టారు. విభజన తర్వాత ఏపీ, తెలంగాణలో ఒడిదిడుగులు ఎదుర్కొన్నా ముందడుగేస్తోంది కమ్మ సామాజికవర్గం.
అయితే తాజాగా తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయ్. ఖమ్మంలో జరిగిన చిన్న ఘటనను రాద్ధాంతం చేస్తున్నారని.. తనపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు మంత్రి పువ్వాడ. కొంత మంది సూడో చౌదరీలు ప్రత్యర్థులతో చేతులు కలిపి తనను కేబినెట్ నుంచి తప్పించాలని చూస్తున్నారని విమర్శించారు.
ఏపీలో ఉన్న ఒకే ఒక్క కమ్మ మంత్రిని మంత్రివర్గ విస్తరణలో తొలగించారని.. ఇప్పుడు తనను కూడా టార్గెట్ చేస్తున్నారన్నారు ఆరోపించారు పువ్వాడ అజయ్... రాజకీయం ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిన తనను అప్రదిష్టపాల్జేయాలని చూస్తున్నారని మండిపడ్డారు అజయ్. కమ్మ సామాజికవర్గానికి ఉన్న ఏకైక ప్రతినిధి విషయంలో ఇలా చేయడం సమంజసమా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.