మాదాపూర్ కాల్పుల కేసులో పురోగతి..
Madhapur Case: ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Madhapur Case: మాదాపూర్ కాల్పుల కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. తాడ్‌బండ్‌లోని 250 గజాల భూమి విషయంలోనే వివాదం చోటు చేసుకుంది. ఈ భూమిని కొన్నాళ్ల క్రితమే మహ్మద్ పేరుపై రియల్ ఎస్టేట్ ఇస్మాయల్ గిఫ్ట్ డీడ్ చేశాడు. వివాదం పరిష్కారం కోసం ఇస్మాయిల్‌ను మహ్మద్ మాదాపూర్‌కు పిలిచాడు. ఇస్మాయిల్, మహ్మద్ మాట్లాడుతుండగా జిలానీ కాల్పులు జరిపాడు. ఇస్మాయిల్‌పై కంట్రీమేడ్ తుపాకీతో 6 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇస్మాయిల్ మృతి చెందగా అతనితో పాటు ఉన్న జహంగీర్‌కు గాయాలయ్యాయి. మహ్మద్‌కు జిలానీ రైట్ హ్యాండ్‌గా ఉన్నాడని తెలుస్తోంది. దీనిపై జహంగీర్ స్పందిస్తూ మహ్మద్-ఇస్మాయిల్ మధ్య భూ వివాదం ఉందన్నాడు. కాల్పుల సమయంలో తాను అడ్డుకునేందుకు వెళ్లిన తనపై జిలానీ కాల్పులు జరిపాడని తెలిపాడు.