తెలంగాణ చరిత్రలో ఎప్పటికి గుర్తుండిపోయే వ్యక్తి

తెలంగాణ పోరాటంలో తనవంతు కృషిని అందించిన ఆచార్య కొత్తపల్లి ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్థంతి ఈ రోజు.

Update: 2020-06-21 07:26 GMT

తెలంగాణ పోరాటంలో తనవంతు కృషిని అందించిన ఆచార్య కొత్తపల్లి ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్థంతి ఈ రోజు. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ఆచార్య జయశంకర్‌ సార్‌కు ఘన నివాళులర్పించారు. తెలంగాణ చరిత్రలో ఎప్పటికి గుర్తుండిపోయే వ్యక్తి జయశంకర్ సార్ అని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో లెక్కలేనన్ని క్షణాలను సార్‌తో పంచుకున్నందుకు తాను ధన్యుడని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ట్విటర్ ని వేదికగా చేసుకుని వెలకట్టలేని సేవలు, అత్యున్నత వ్యక్తిత్వం ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ సొంతమని అన్నారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ను తెలంగాణ ప్రజలు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారని కొనియాడారు.

ఆయనతో పాటు మరికొంత మంది ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ వర్థంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఘననివాళులర్పించారు. పుట్టుక నీది. మరణం నీది. బతుకంతా తెలంగాణది. జోహార్‌ జయశంకర్‌ సార్‌ అని హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కొనియాడారు. సార్‌ కలలు కన్నట్లే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందతూ బంగారు తెలంగాణ దిశగా ముందడుగు వేస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.


Tags:    

Similar News