Priyanka Gandhi: ప్రియాంక టూర్.. మూడు రోజుల్లో 10నియోజక వర్గాల్లో ప్రచారం

Priyanka Gandhi: సా. 4గంటలకు గద్వాలలో ప్రచార సభ

Update: 2023-11-20 11:46 GMT

Priyanka Gandhi: ప్రియాంక టూర్.. మూడు రోజుల్లో 10నియోజక వర్గాల్లో ప్రచారం

Priyanka Gandhi: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. అగ్రనేతలు వరుస పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. మూడు రోజుల్లో 10 నియోజకవర్గాల్లో ప్రియాంక ప్రచారం నిర్వహిస్తారు. 24న ఉదయం 11గంటలకు పాలకుర్తి, మధ్యాహ్నం 2గంటలకు హుస్నాబాద్, సాయంత్రం 4గంటలకు ధర్మపురిలో ప్రచారం నిర్వహిస్తారు. 25న పాలేరు, ఖమ్మం, వైరా, మధిర నియోజకవర్గాలలో ప్రచార సభల్లో పాల్గొంటారు. 27న 11గంటలకు మునుగోడు, మధ్యాహ్నం 2గంటలకు దేవరకొండ, సాయంత్రం 4గంటలకు గద్వాల ప్రచార సభలలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు.

Tags:    

Similar News