private hospitals not following govt rules: ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేట్ ఆస్పత్రులు పట్టించుకోవడం లేదా అంటే అవుననే చెప్పాలి. కరోనా బిల్లుల విషయంలో ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు ఉల్లంగిస్తే యాభై శాతం బెడ్స్ తీసుకుంటామని హెచ్చరించినా ఏ మాత్ర ఖాతరు చేయడం లేదు. యథేచ్చగా కరోనా పేరు చెప్పి బాధితుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులను ఆజమాయిషీ చేయలేని పరిస్థితికి ప్రభుత్వం దిగజారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే ప్రైవేట్ హాస్పటల్స్‌లో ఇష్టారాజ్యంగా కరోనా రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాట్సప్ కంప్లైంట్ నెంబర్‌ని అందుబాటులో ఉంచింది. ఈ నెంబర్‌కు వేలల్లో కంప్లైంట్స్ వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ప్రైవేట్ హాస్పటల్స్‌కు నోటీసులు జారీ చేసింది. అయినా ప్రైవేట్ హాస్పటల్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. కొవిడ్ విషయంలో 50 శాతం బెడ్స్ ప్రభుత్వానికి ఇవ్వాలనే ప్రతిపాదనకు ప్రైవేట్ హాస్పటల్స్ సముకంగా లేవు. ఇప్పటికే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ప్రైవేట్ హాస్పటల్స్‌తో జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. మళ్లీ చర్చలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ప్రైవేట్ హాస్పటల్స్ యాజమాన్యాలు సిద్ధమవుతున్నారు.