Ram Nath Kovind: 54 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
Ram Nath Kovind: సమతామూర్తి 120 కిలోల బంగారు విగ్రహానికి రాష్ట్రపతి ప్రత్యేక పూజలు
Ram Nath Kovind: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని సమతామూర్తి కేంద్రంలో జగద్గురు రామానుజాచార్యుల వెయ్యేళ్ల పండుగ శోభాయమానంగా సాగుతోంది. 54 అడుగుల సమతామూర్తి 120 కిలోల స్వర్ణ ప్రతిమను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించి లోకార్పణం చేశారు. స్వర్ణమూర్తి వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సమతామూర్తి బంగారు విగ్రహానికి రాష్ట్రపతి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. విగ్రహావిష్కరణకు ముందు సమతామూర్తి కేంద్రంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్..216 అడుగుల రామానుజ విగ్రహాన్ని సందర్శించారు. దివ్యక్షేత్రంలోని 108 వైష్ణవ ఆలయాలను దర్శించుకున్నారు.