Nalgonda: నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోరం

Nalgonda: సాధారణ ప్రసవం కోసం కడుపుపై ప్రెజర్ పెంచిన వైద్యులు

Update: 2022-09-18 11:17 GMT

Nalgonda: నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోరం 

Nalgonda: తెలంగాణలో మరో ఘోరం చోటు చేసుకుంది. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. వారం రోజుల క్రితం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి అఖిల అనే గర్భిణి పురిటి నొప్పులతో వచ్చింది. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉన్న అఖిలకు ఇవాళ నొప్పులు ఎక్కువయ్యాయి. సాధారణ ప్రసవం చేసే క్రమంలో వైద్యులు ఆమె కడుపుపై ప్రెజర్ తీసుకొచ్చారు. అయితే బేబీ వెయిట్‌ ఎక్కువ కావడంతో నార్మల్ డెలివరీ కష్టసాధ్యమైంది.

అయితే చివరి నిమిషంలో చేతులెత్తేసిన డాక్టర్లు హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. గాంధీలో చికిత్స పొందుతూ అఖిల ప్రాణాలు కోల్పోయింది. నొప్పులు ఎక్కువ కావడంతో గర్భసంచి పగిలిపోయిందని దీంతో పాటే తీవ్ర రక్తస్రావంతో కిడ్నీలపై ప్రభావం పడిందని అందువల్లే అఖిల మరణించినట్లు గాంధీ డాక్టర్లు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే అఖిల ప్రాణాలు కోల్పోయిందంటూ బంధువులు నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఆమె మృతదేహంతో నిరసన చేపట్టారు. ఇటు విషయం అందుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. 

Tags:    

Similar News