TSRTC: TSRTC ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
TSRTC: 21 శాతం ఫిట్మెంట్ ప్రకటన
TSRTC: తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 21 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేసంది. 2017 నుంచి 21 శాతం పీఆర్సీతో పే స్కేలు అమలు చేస్తాం. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. జూన్ 1 నుంచి కొత్త ఫిట్ మెంట్ అమలు చేయనున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. కొత్త ఫిట్ మెంట్ తో ఆర్టీసీపై నెలకు రూ. 35 కోట్ల భారం పడుతుందని మంత్రి పేర్కొన్నారు.