మెయిన్‌ సర్వర్‌ నుంచే పేపర్‌ కొట్టేసిన ప్రవీణ్‌.. ఒక్కో పేపర్‌కి రూ. 20 లక్షలు డిమాండ్ చేసిన రేణుక..

Paper Leak Case: TSPSC పేపర్ లీకేజీ కేసులో... నిందితులను కోర్టులో హాజరుపరిచారు బేగంబజార్‌ పోలీసులు.

Update: 2023-03-14 12:58 GMT

మెయిన్‌ సర్వర్‌ నుంచే పేపర్‌ కొట్టేసిన ప్రవీణ్‌.. ఒక్కో పేపర్‌కి రూ. 20 లక్షలు డిమాండ్ చేసిన రేణుక..

Paper Leak Case: TSPSC పేపర్ లీకేజీ కేసులో... నిందితులను కోర్టులో హాజరుపరిచారు బేగంబజార్‌ పోలీసులు. దీంతో నిందితులకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 9 మందిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించారు పోలీసులు. TSPSCకి వచ్చే చాలామందితో ప్రవీణ్‌ సంబంధాలు పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

ప్రవీణ్‌ సెల్‌ఫోన్లో చాలామంది మహిళల కాంటాక్ట్స్‌ ఉన్నట్లు గుర్తించారు. ప్రధాన సర్వర్ నుంచి పేపర్‌ కొట్టేసిన ప్రవీణ్... రేణుకకు ఇచ్చారు. దీంతో తమ కమ్యూనిటీలోని పలువురికి పేపర్ ఉందంటూ చెప్పిన రేణుక... ఒక్కో పేపర్‌కి రూ.20 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిపారు. అయితే పేపర్ కొనుగోలుకు ముందుకు వచ్చిన ఇద్దరు అభ్యర్థుల్ని... తన ఇంట్లోనే రేణుక ప్రిపేర్ చేయించినట్లు తేలింది. పరీక్ష రోజున సరూర్‌నగర్‌లోని సెంటర్లో అభ్యర్థులను వదిలిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News