Ponguleti Srinivasa Reddy: మేడిగడ్డ నష్టాన్ని ఏజన్సీతో కట్టించాలి..
Ponguleti Srinivasa Reddy: మేడిగడ్డ ప్రాజెక్ట్ గత ప్రభుత్వం నిర్మాణంలో రూల్స్ పాటించనందుకే కుంగిపోయిందని మంత్రి పొంగులేటి అన్నారు.
Ponguleti Srinivasa Reddy: మేడిగడ్డ ప్రాజెక్ట్ గత ప్రభుత్వం నిర్మాణంలో రూల్స్ పాటించనందుకే కుంగిపోయిందని మంత్రి పొంగులేటి అన్నారు. టాప్ లాగ్ గేట్స్ పనిచేయకపోయినందుకే కుంగిపోయిందన్నారు. తన మార్కు కనిపించాలనే ఉద్దేశంతోనే మేడిగడ్డ బ్యారేజ్ ను నిర్మించారన్నారు. ఈ ప్రాజెక్ట్ ఖర్చు ప్రతి పైసా కూడా అప్పు చేసి గత ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు. ఇప్పుడు ఆ సొమ్ముకు మార్కెట్ రేటు కంటె 12 శాతం ఎక్కువ వడ్డీ కడుతున్నామ్నారు. లక్ష కోట్లతో 50 టీఎంసీలు ఎత్తిపోస్తున్నారున్నారు. మేడిగడ్డ నష్టాన్ని ఏజన్సీతో కట్టిస్తారా లేదా అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. గత ప్రభుత్వం ప్రజలపై ఎంత భారం పడుతుందో ఆలోచించలేదన్నారు. కాళేశ్వరం డ్యామేజ్ కావడం దురదృష్టకరమని తెలిపారు. లక్షల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులకు బిల్డర్లదే బాధ్యత అని మంత్రి పొంగులేటి అన్నారు.