సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. రాజ్యసభకు అసంతృప్త నేత..?

Ponguleti Srinivas Reddy: ఖమ్మం జిల్లాలో గులాబీ నేతలు సైలెంట్ అవుతున్నారు.

Update: 2022-05-06 11:30 GMT

సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. రాజ్యసభకు అసంతృప్త నేత..?

Ponguleti Srinivas Reddy: ఖమ్మం జిల్లాలో గులాబీ నేతలు సైలెంట్ అవుతున్నారు. నేతల మధ్య సయోధ్య కుదురుతోందా? పదవులు రాబోతున్నందునే నేతలు మౌన ముద్ర దాల్చారా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాజ్యసభ బెర్త్ ఖరారంటూ పార్టీలో ప్రచారం జరుగుతోంది. తుమ్మల, పొంగులేటి మధ్య సమన్వయం సాధించి గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టాలని పార్టీ యోచిస్తోంది.

మొత్తం వ్యవహారాన్ని మంత్రి కేటీఆర్ నేరుగా డీల్ చేస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న పొంగులేటి పార్టీలో ఉండటం ఎంతో అవసరమని కేటీఆర్ భావిస్తున్నారు. అందుకే ఆయన పార్టీని వీడకుండా చూసుకుంటున్నారు. ఇప్పటికే తుమ్మలతో మాట్లాడిన పార్టీ ముఖ్యులు ఇప్పుడు పొంగులేటి వ్యవహారాన్ని సెట్ చేయాలని భావిస్తున్నారు. పొంగులేటికి కీలక పదవి ఇచ్చే విషయంలో సీఎం కేసీఆర్ సైతం సానుకూలంగా ఉన్నారని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయ్. 

Tags:    

Similar News