Ponguleti Srinivas Reddy: ఉచిత కరెంట్‌పై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే హక్కు లేదు
Ponguleti Srinivas Reddy: తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశాడు
Ponguleti Srinivas Reddy: ఉచిత కరెంట్‌పై బీఆర్ఎస్ నాయకులకు మాట్లాడే హక్కు లేదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఉచిత కరెంట్‌ను ప్రవేశపెట్టిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. 72 నుండి 82 సీట్లు గెలిచి కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశాడని విమర్శించారు. సీఎం కేసీఆర్ హిట్లర్‌లా నియంత పాలన చేస్తున్నాడని ఆరోపించారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్ధి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేముల వీరేశంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రచారం నిర్వహించారు.