తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న పొలిటికల్ వార్
T Congress: రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ పార్టీని వీడుతున్న నేతలు
T Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో పొలిటికల్ వార్ ముదురుతోంది. రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా తర్వాత వెంటనే దాసోజు శ్రవణ్ షాకిచ్చారు. దాసోజు శ్రవణ్ రాజీనామా ప్రస్తావిస్తూ రేవంత్‌పై వెంకట్‌రెడ్డి ఫైరయ్యారు. రేవంత్ తీరు వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారుతోందని కామెంట్స్ చేశారు. నిన్న చండూరు సభలో రాజగోపాల్‌రెడ్డిపై టీకాంగ్ లీడర్స్ మండిపడ్డారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపైనా దామోదర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. వెంకట్‌రెడ్డి ఏ గట్టున ఉంటారో తేల్చుకోవాలని అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. ఇప్పటికే రేవంత్ తీరును నిరసిస్తూ జగ్గారెడ్డి పలుమార్లు బహిరంగ విమర్శలు చేశారు.
రోజుకొకరు కాంగ్రెస్ పార్టీలో బాంబు పేలుస్తుండటం కలకలం రేపుతోంది. ఎప్పుడు ఎవరు ఏం నిర్ణయం ప్రకటిస్తారోనని తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ నెలకొంది. మరోవైపు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలో రాజగోపాల్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టనున్నారు. కాంగ్రెస్ నేతల విమర్శలపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎలా స్పందిస్తారనే ఉత్కంఠ నెలకొంది. అటు దాసోజు శ్రవణ్ కూడా ఢిల్లీ వెళ్తున్నారు. బీజేపీ పెద్దలతో సమావేశం కాబోతున్నారు. టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ సైతం ఢిల్లీలోనే ఉండటం పొలిటికల్ హీట్ ను మరింత పెంచుతోంది.