Political fraternity express condolences to over Nandi Yellaiah's death: కాంగ్రెస్ సీనియర్ నేత నంది ఎల్లయ్య అకాల మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జి ఆర్.సి కుంతియా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ లు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మాజీ మంత్రి డీకే సమరసింహరెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. నంది ఎల్లయ్య మృతిపట్ల రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డితో పాటు పలువురు సంతాపం తెలిపారు.
నంది ఎల్లయ్య మృతి పట్ల రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నంది ఎల్లయ్య సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉండి దళితులు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి అవిరామ కృషి చేశారన్నారు. నంది ఎల్లయ్య ఆరుసార్లు లోక్ సభకు, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికై ప్రజల మనిషిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారన్నారు. అనారోగ్యంతో మరణించిన నంది ఎల్లయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
నంది ఎల్లయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి హరీష్ రావు. సిద్దిపేట పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సమయంలో మంత్రి గా , ఎమ్మెల్యే గా తనతో కలిసి పని చేసిన అనుబందాన్ని గుర్తు చేస్కున్న మంత్రి హరీష్ రావు . నంది ఎల్లయ్య సీనియర్ రాజకీయ నాయకునిగా రాజకీయాల్లో తన నిరాడంబరాన్ని చాటుకున్నారూ మంచి మనసున్న వ్యక్తిత్వం అని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని , వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.