మాదక ద్రవ్యాలపై పోలీసుల ఉక్కుపాదం

Drugs: డ్రగ్ ఫ్రీ స్టేట్ గా మార్చేందుకు పోలీస్ శాఖ యత్నం

Update: 2022-02-15 06:31 GMT

మాదక ద్రవ్యాలపై పోలీసుల ఉక్కుపాదం

Drugs: తెలంగాణను డ్రగ్ ఫ్రీ స్టేట్ గా మార్చేందుకు పోలీసు శాఖా సమాయత్తం అయ్యింది. సీఎం కేసీఆర్ ఆదేశాలో మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో నార్కోటిక్స్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్, నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్ విజన్ వింగ్ లు ఏర్పాటు చేశారు. డ్రగ్స్ అరికట్టేందుకు సిటీ పోలీసులు చర్యలు చేపట్టిన పోలీసులు వివిధ రకాల కార్యక్రమాలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మితిమీరిన మాదక ద్రవ్యాల వినియోగం పెద్ద సమస్య మారిందని హైదరాబాద్ సిటి పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ రవాణా, విక్రయించే వారినే కాకుండా సేవించే వారిపైనా చర్యలు తీసుకోనున్నట్లు సీపీ హెచ్చరించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో విద్యార్ధులకు, కలనీ వాసులకు డ్రగ్స్ వాడకం వల్ల ఎలాంటి సమస్యలు తెలెత్తుతాయన్న అంశంపై అవెర్ నెస్ కల్పిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్ధులపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని సూచించారు.

మాదకద్రవ్యాల మాట వినబడకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. అసలు డ్రగ్స్ మూలాలను కనుగొని చైన్ కట్ చేయాలని భావిస్తున్నారు. డ్రగ్స్ నివారణపై కాప్స్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో వేచి చూడాలి మరీ..


Tags:    

Similar News