గత కొంత కాలంగా ఎక్కడ చూసినా అనేక మంది యువత ఏవో చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఇంట్లో మందలించారనో, పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేదనో, మొబైల్ ఫోన్లు కొనివ్వలేదనో ఇలా ఏదో ఒక కారణంతో మనస్తాపాలకు గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇక మరికొంత మంది అయితే చనిపోయే ముందు సెల్ఫీ వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇంతకు ముందు సోషల్ మీడియాలో పోస్ట్ అయిన వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. అలాంటి వీడియోనే తాజాగా ఓ యువకుడు పోస్ట్ చేసి ఆత్మహత్యకు సిద్ధమయ్యడు. ఆ వీడియోని చూసిన పోలీసులు వెంటనే స్పందించి ఆ యువకున్ని రక్షించారు.
అయితే ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. మధుసూదన్‌రెడ్డి మాజీ కానిస్టేబుల్ చివ్వెంల మండలం బండమీదిచందుపట్లలో నివసించే వాడు. అయితే ఆయన గతంలో అన్నెపర్తి బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించాడు. అయితే ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్న మధుసూదన్‌రెడ్డిని సైకోలా వ్యహరించడం మొదలు పెట్టాడు. దీంతో కుటుంబ సభ్యులు కూడా అతన్ని పట్టించుకోకుండా వదిలేశారు. దాంతో అతను మరింత కుమిలిపోయి తనకు ఎవరు లేరన్న మనస్తాపం చెందారు. కుటుంబసభ్యుల దూరంగా పెట్టడాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో షేర్‌చేశాడు. అయితే ఈ విషయాన్ని ఓ కేసు విషయంలో చందుపట్లకు వెళ్లిన ఎస్సై లోకేష్‌కు గ్రామస్థులు తెలిపారు. దీంతో స్పందించిన పోలీసులు వెంటనే సెల్‌ఫోన్ నెట్‌వర్క్ ఆధారంగా మధుసూదన్ రెడ్డి కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో ఉన్నట్లు గుర్తించారు. అతన్ని వెతుక్కుంటూ వెళ్లిన పోలీసులు బృందం మధుసూదన్‌రెడ్డిని రక్షించింది. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన అతన్ని గుర్తించి క్షేమంగా ఇంటికి చేర్చారు.