Telangana: పోలీసుల ప్రాణాల మీదకు తెస్తున్న వరుస బందోబస్తులు
* విధి నిర్వాహణలో భాగంగా థర్డ్‌వేవ్ బారిన పడుతున్న పోలీసులు * కరోనాతో పోరాడుతూ హోంగార్డ్ సుధాకర్ మృతి
Telangana: కరోనా ధర్డ్‌వేవ్ భయం పోలీస్ శాఖను వెంటాడుతోందా..?? ధర్డ్‌వేవ్ బారిన ఇప్పటికి ఎంతమంది అధికారులు పడ్డారు..?? పోలీస్ శాఖపై ధర్డ్ వేవ్ పంజా విసరడానికి ప్రధాన కారణాలేంటీ..?? ధర్డ్ వేవ్ అనే మాట ప్రస్తుతం పోలీసుశాఖలో హాట్ టాపిక్ గా మారింది. విధి నిర్వాహణలో భాగంగా థర్డ్‌వేవ్ బారిన పడుతున్న పోలీసులు ఆందోళన చెందుతున్నారు.
ధర్డ్‌వేవ్ భయం ప్రస్తుతం పోలీసు శాఖను కలవర పెడుతోంది. వరుస బందోబస్తులు పోలీసుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని ఎస్ఆర్ నగర్ పీఎస్ లో హోంగార్డుగా విధులు నిర్వహించే సుధాకర్ రెడ్డి గత కొంతకాలంగా కరోనాతో పోరాడుతూ మృతి చెందారు.
ఇప్పటికే ధర్డ్ వేవ్ కారణంగా 15 రోజుల్లోనే 11 మంది పోలీసులు కరోనా బారిన పడినట్లు సమాచారం. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా అధికారులు వైరస్ బారిన పడుతున్నారు. విధి నిర్వాహణను కాదనలేక వృత్తి ధర్మంతో డ్యూటీ చేస్తూ పోలీసు అధికారులు ధర్డ్‌వేవ్ బారిన పడుతున్నారు. మరోవైపు థర్డ్‌వేవ్ భయం పోలీసు కుటుంబాలను ఆందోళన కల్గిస్తుంది.