TS Police Jobs: తెలంగాణలో 19వేలకు పైగా పోలీస్ జాబ్ లు...భారీ నోటిఫికేషన్ కు రంగం సిద్ధం

TS Police Jobs: 19వేలకు పైగా పోలీసు ఉద్యోగాల భర్తీ గురించి నేడు కేసీఆర్ ప్రకటించే అవకాశాలు న్నట్లు సమాచారం.

Update: 2021-07-04 01:38 GMT

Telangana Police

TS Police Jobs: తెలంగాణ పోలీస్ శాఖలో 19వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు పూర్తి చేశారు. సీఎం కేసీఆర్ నేడు(ఆదివారం) వాటి భర్తీ గురించి ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం. సిరిసిల్ల పర్యటనలో భాగంగా ఆయన ఈ ప్రకటన చేస్తారిని తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే తెలంగాణాలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఇదే భారీ నోటిఫికేషన్ కానుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం 2014లో తొలిసారి ఇచ్చారు. 2018లో మరోసారి పెద్ద ఎత్తున పోస్టుల ప్రకటించారు. ఆ సమయంలో 1,217 మంది స్సైలు, 16,925 మంది కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు.

పలు కారణాలతో వీటిలో దాదాపు 3వేల వరకు బ్యాక్ లాగ్ పోస్టులు మిగిలిపోయాయి. ప్రస్తుతం ఇచ్చే ఉద్యోగాల్లో 33 శాతం మహిళలకు కేటాయించనున్నారు. అయితే డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీసు శాఖలో ఖాళీలను గుర్తించి ఆ నివేదికను ఆర్థిక శాఖకు అందించారు. ఆర్థిక శాఖ నుంచి ఆమోదం రాగానే ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో త్వరలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని నెలల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే.. వరుస ఎన్నికలు, కరోనా విజృంభణ, జోనల్ వ్యవస్థ, కొత్త జిల్లాలకు సంబంధించిన సాంకేతిక సమస్యల కారణంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియ వేగంగా ముందుకు సాగలేదు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో కొత్త జోన్లను అమల్లోకి తీసుకువస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవోను సైతం విడుదల చేయడంతో ఇక నియామక ప్రక్రియను పట్టాలెక్కించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు అత్యధికంగా పోలీస్ శాఖలోనే ఉన్నాయన్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News