మోడీ భాగ్యలక్ష్మిని దర్శించుకుంటారా?

PM Narendra Modi: హైదరాబాద్‌ చార్మినార్‌లోని భాగ్యలక్ష్మీ అమ్మవారి దర్శనానికి ప్రధాని మోడీ వస్తారా?

Update: 2022-07-02 11:48 GMT

మోడీ భాగ్యలక్ష్మిని దర్శించుకుంటారా?

PM Narendra Modi: హైదరాబాద్‌ చార్మినార్‌లోని భాగ్యలక్ష్మీ అమ్మవారి దర్శనానికి ప్రధాని మోడీ వస్తారా? వస్తారనే అంటున్నారు రాష్ట్ర కమలనాథులు. అబ్బే అది షెడ్యూల్‌లో లేదని పీఎంవో వర్గాలు చెబుతున్నాయి. ఏమైనా వస్తారన్న అంచనాతోనే భాగ్యలక్ష్మీ అమ్మవారి పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. షెడ్యూల్‌లో లేకుంటే ఏంటీ అప్పటికప్పుడు మోడీ మనసు మార్చుకొని వచ్చినా రావొచ్చన్న ఒపినీయన్‌తో ఎంతకైనా మంచిదని చార్మినార్‌ ప్రెమిసెస్‌ను తమ కంట్రోల్‌ ఉంచుకున్నారు పోలీసులు.

అసలు భాగ్యలక్ష్మీ అమ్మవారి దర్శనానికి మోడీ ఎందుకు రావాలి? ప్రధాని హైదరాబాద్‌ వస్తున్న పర్పస్‌ వేరు. కమలనాథులు కోరుతున్నది వేరు. మొన్నెప్పుడో బీజేపీ కార్పొరేటర్లు అందరూ కలసి ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. సార్‌ ఎలాగూ హైదరాబాద్‌ వస్తున్నారు కదా ఒక్కసారి మా అమ్మవారిని దర్శించుకోండని కోరారు. నవ్వుతూ మోడీ ఓకే అన్నారు. ఆ ధ్యాసలోనే ఉన్న కమలనాథులు భాగ్యలక్ష్మీ అమ్మవారిని మోడీ కచ్చితంగా దర్శించుకుంటారని చెప్పుకుంటున్నారు.

కాస్త భక్తిభావం, ఇంకాస్త ఆధ్యాత్మిక చింతన ఉన్న మోడీ భాగ్యలక్ష్మీని దర్శించుకుంటారని అంటున్నారు. ఎటూ హైదరాబాద్‌లోనే రెండు రోజులు ఉంటారు కాబట్టి వచ్చిన తొలిరోజే కాకపోయినా తెల్లారైనా అమ్మవారి దర్శనానికి వస్తారని కమలనాథులు అంటున్నారు. పరేడ్ మైదానంలో సభకు ముందో, ఆ తర్వాతో అలా వెళ్లి ఇలా వస్తారని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి, నిన్ననే హైదరాబాద్‌ వచ్చిన కొందరు కమలం నేతలు భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. మోడీ కూడా అలాగే వస్తారని అంచనా వేస్తున్నా కమలనాథులు. ఏమైనా మోడీ భాగ్యలక్ష్మీ అమ్మవారి దర్శనం చేసుకుంటారో లేదో కానీ, ఒకవైపు కమలం నేతలు, మరోవైపు పోలీసులు ఆ ఏరియాను తమ కంట్రోల్‌లోకి తెచ్చుకున్నారు. 

Full View


Tags:    

Similar News