Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఉప రాష్ట్రపతి, ప్రధాని

Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బుధవారం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Update: 2021-06-02 05:37 GMT

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఉప రాష్ట్రపతి, ప్రధాని

Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బుధవారం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఘనమైన చరిత్ర, విశిష్ట సంస్కృతులకు నిలయమైన తెలంగాణ.. సహజ వనరులతో, నైపుణ్యం కల్గిన మానవ వనరులతో వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతిని, స్వయం సమృద్ధిని సాధిస్తూ దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను అని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్‌ చేశారు. అనేక రంగాల్లో రాణించిన ప్రత్యేకమైన సంస్కృతితో అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.



Tags:    

Similar News