Phone Tapping: ఎల్లుండి చలో రాజ్‌భవన్‌కు టీకాంగ్రెస్ పిలుపు
Phone Tapping: సోనియా, రాహుల్ గాంధీ ఫోన్ల ట్యాంపరింగ్‌కు నిరసనగా ఎల్లుండి చలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చింది తెలంగాణ కాంగ్రెస్.
Phone Tapping: సోనియా, రాహుల్ గాంధీ ఫోన్ల ట్యాంపరింగ్‌కు నిరసనగా ఎల్లుండి చలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చింది తెలంగాణ కాంగ్రెస్. దేశంలో భావస్వేచ్ఛ లేకుండా పోతోందని, ఫోన్ కాల్స్‌ను ట్యాప్ చేస్తూ ప్రజాస్వామ్యానికి రక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఫోన్ల ట్యాంపరింగ్‌పై ప్రధాని మోడీ, అమిత్ షా ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు భట్టి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో, చట్టబద్దంగా, రాజ్యాంగబద్దంగా గుర్తించిన ప్రతిపక్ష పార్టీల మనుగడకు సంబంధించి, వాటి భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగితే అది ప్రజాస్వామ్య మూల సిద్దాంతాలకు ప్రమాదమేనని పేర్కొన్నారు. పెగాసెస్ ఫోన్ ట్యాపింగ్ పై ప్రధాని మోడీ మౌనం వీడి ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని కోరారు. మీడియా సంస్థలపైన కూడా పెగాసెస్ నిఘా పనిచేస్తోందని తెలిపారు.