రేషన్‌ సరుకులకు ఫోన్‌ నెంబర్‌ లింక్‌...జనాలు తీవ్ర ఇబ్బందులు

Update: 2021-02-02 06:21 GMT

Representational Image

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో రేషన్‌ సరుకులకు ఫోన్‌ నెంబర్‌ లింక్‌ చేయడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓటీపీ ఉంటేనే రేషన్‌ ఇస్తామని నిబంధనలు పెట్టడంతో మొబైల్ లేని వారు ఇబ్బంది పడుతున్నారు. రేషన్‌ కార్డుకు మొబైల్‌ నెంబర్‌ లింక్ చేసేందుకు ఈ సేవా కేంద్రాల దగ్గర జనాలు బారులు తీరారు. పాత పద్దతిలోనే రేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం తెల్ల రేషన్‌ కార్డులకు ఓటీపీ నిబంధన పెట్టింది. దీంతో లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. ఇన్నాళ్లు రేషన్‌ షాపులో వేలి ముద్రలు వేసి రేషన్‌ తెచ్చుకునే వారు. ఇప్పుడు రేషన్‌ పొందాలంటే ఫోన్‌ నెంబర్‌ లింక్‌ అయి ఉండాలి. ఏ ఫోన్‌ నెంబర్‌ అయితే రేషన్‌ కార్డుకు జతపరుస్తారో ఆ నెంబర్‌కు ఓటీపీ రావడంతో బియ్యం ఇస్తున్నారు. ఆధార్‌కు ఫోన్‌ లింక్‌ చేసుకోవడం కోసం జనాలు ఈసేవా కేంద్రాల దగ్గర క్యూ కడుతున్నారు. రేషన్‌ కష్టాలు గట్టెక్కించాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News