Telangana: గాంధీభవన్‌లో పీసీసీ క్రమశిక్షణ సంఘం సమావేశం

Telangana: అద్దంకి దయాకర్‌కు షోకాజ్‌ నోటీసు ఇవ్వాలని నిర్ణయం

Update: 2022-05-02 03:22 GMT

గాంధీభవన్‌లో పీసీసీ క్రమశిక్షణ సంఘం సమావేశం

Telangana: అద్దంకి దయాకర్‌కు షోకాజ్‌ నోటీసు ఇవ్వాలని పీసీసీ క్రమశిక్షణ సంఘం నిర్ణయించింది. నిన్న గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ క్రమశిక్షణ సంఘం సమావేశంలో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌ చిన్నారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. 2018లో తాను తుంగతుర్తి నుంచి పోటీ చేయగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రామిరెడ్డి దామోదర్‌రెడ్డి తనను ఓడించారని పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన అద్దంకి దయాకర్‌ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ ముగ్గురిపై విమర్శలు చేశారు. ఆ వ్యాఖ్యలపై మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి ఆధారాలతో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై చర్చించిన క్రమశిక్షణ సంఘం ఆయనకు షోకాజ్‌ నోటీసు ఇవ్వాలని నిర్ణయించింది.

కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్‌ ఎంపీ అభ్యర్థి మదన్‌ మోహన్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించడం సరికాదని, సస్పెండ్‌ చేసే అధికారం డీసీసీ అధ్యక్షులకు లేదని క్రమశిక్షణ కమిటీ స్పష్టం చేసింది. ఈమేరకు లేఖ రాయాలని కమిటీ నిర్ణయించింది. జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రఘువరెడ్డి తన పరిధి దాటి వరంగల్ పరిధిలో రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై కూడా జంగా రాఘవ రెడ్డి లేఖ రాయాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది.

Full View


Tags:    

Similar News