Revanth Reddy: మల్లారెడ్డి అవినీతిపై విచారణ ఎందుకు జరపరు?

Revanth Reddy: సహచరులపై అవినీతి ఆరోపణలు వస్తే చర్యలు తీసుకుంటానని సీఎం కేసీఆర్‌ చెప్పారని, అవినీతి ఆరోపణలు వస్తే ఉపేక్షించనని..

Update: 2021-08-27 12:12 GMT

Revanth Reddy: మల్లారెడ్డి అవినీతిపై విచారణ ఎందుకు జరపరు?

Revanth Reddy: సహచరులపై అవినీతి ఆరోపణలు వస్తే చర్యలు తీసుకుంటానని సీఎం కేసీఆర్‌ చెప్పారని, అవినీతి ఆరోపణలు వస్తే ఉపేక్షించనని గతంలో ఇద్దరు మంత్రులపై వేటు కూడా వేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. మంత్రి మల్లారెడ్డికి సంబంధించి చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. తాను మల్లారెడ్డి అవినీతిపై ఆధారాలిచ్చానని పేర్కొన్నారు. 

ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించిన వ్యవహారంలో మల్లారెడ్డిని కేసీఆర్ ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించారు. 50 ఎకరాల రియల్ ఎస్టేట్‌ వ్యవహారంలో మంత్రి మల్లారెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. మల్లారెడ్డిపై విచారణకు కేసీఆర్‌ సాహసించలేదని తప్పుబట్టారు. లే అవుట్లలో ప్లాట్లు అమ్ముకునే వారి నుంచి మామూళ్లు వసూలు చేశారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.  

Full View


Tags:    

Similar News