Pawan Kalyan: రిపబ్లిక్‌ ప్రి రిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌ ఘాటు వ్యాఖ్యలు

Pawan Kalyan: ఏపీలో ఉన్నది వైసీపీ రిపబ్లిక్‌ కాదు.. ఇండియన్‌ రిపబ్లిక్ -పవన్‌

Update: 2021-09-26 01:16 GMT

ఘాటు వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ (ఫైల్ ఇమేజ్)

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రిపబ్లిక్‌ ప్రిరిలీజ్‌ ఫంక్షన్‌లో హాట్‌ కామెంట్స్ చేశారు. భావోద్వేగంతో ప్రసంగం మొదలు పెట్టిన పవన్ కల్యాణ్ సినీ వేదికను ఒక్కసారిగా పొలిటికల్‌ వేదికగా మార్చేశారు. ఏపీలో ఉంది వైసీసీ రిపబ్లిక్‌ కాదు. ఇండియన్‌ రిపబ్లిక్ అని పవన్‌ అన్నారు. సినీ ఇండస్ట్రీకి కులాలు, మతాలు ఉండవన్నారు. సినీ పరిశ్రమకు ఇబ్బందులు కలిగిస్తే తాట తీస్తానని హెచ్చరించారు. తెలంగాణలో థియేటర్లు ఉన్నాయి. మరీ ఏపీలో ఎందుకు లేవని ప్రశ్నించారు. సినీ ఇండస్ట్రీ వైపు కన్నెత్తి చేస్తే సహించేది లేదన్నారు. సినిమా రంగం జోలికి వస్తే అంతా కలిసిరావాలని పిలుపునిచ్చారు.

సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌కి గురైతే మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయన్న పవన్ కల్యాణ్ మీడియాకి చురకలేస్తూ.. ఆ ఇష్యూని వైసీపీ వైపు డైవర్ట్ చేశారు. వెదవలు, సన్నాసులు, వైసీపీ సెక్స్ రాకెట్లూ అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తన సినిమాలను ఆపడం కోసం మొత్తం ఇండస్ట్రీని ఇబ్బందులకు గురి చేస్తున్నారన ఆవేదన వ్యక్తం చేశారు. సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై కొందరు వివాదాస్పదంగా మాట్లాడారని... తేజ్ ప్రమాదం కంటే వైఎస్ వివేకా హత్యపై ఎందుకు మాట్లడరని ప్రశ్నించారు. కోడి కత్తి గొడవ కేసు ఏమైందో గిరిజనులకు పోడు భూములు ఎందుకు దక్కడం లేదో మాట్లాడరెందుకన్నారు. మాలో మాకు అభిప్రాయా బేధాలు ఉండొచ్చు కానీ అవి శతృత్వం కాదని పవన్ కల్యాణ్ అన్నారు. సినిమా వాళ్ల కష్టాల గురించి మోహన్ బాబు మాట్లాడాలని సూచించారు.  

Tags:    

Similar News