కానరాని కాకతీయ, పుష్పుల్ రైళ్లు
Warangal Passenger Trains: కాకతీయ, పుష్పుల్ రైళ్లను ట్రాక్ ఎక్కించాలని ప్రయాణికుల డిమాండ్
Warangal Passenger Trains: పేదవాడి రథాలను నిలిపివేశారు. తక్కువ చార్జీలతో గమ్యానికి చేరే వేసే రైళ్లను ట్రాక్ ఎక్కకుండా చేశారు. లాక్ డౌన్ టైంలో కొన్ని రైళ్లను నిలిపివేశారు. దశలవారీగా లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత యధావిధిగా ఎక్స్‌ప్రెస్, స్పెషల్, వీక్లీ రైళ్లు పట్టాలెక్కాయి. కాని పేదల బడ్లు ప్యాసింజర్, కాకతీయ రైళ్ల కూత వినిపించడం లేదు. పుష‌్పుల్, కాకతీయ రైళ్లు కానరావడం లేదు. ప్యాసింజర్ రైలు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం మీదుగా విజయవాడ వరకు వెళ్తుంది. కాజీపేట నుండి సికింద్రాబాద్ కు కాకతీయ ఫాస్ట్ ప్యాసింజర్ అందరికి కన్వినెంట్‌గా ఉండేది. కానీ ఇప్పుడు రైళ్లు లేక ప్రయాణికులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
కరోనా టైంలో గత రెండేళ్లుగా పుష్పుల్, కాకతీయ ట్రైన్స్ ను నిలిపివేశారు రైల్వే అధికారులు. దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత అన్ని రైళ్లను పునరుద్ధరించారు, కాని పేదోడి బండ్లను మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్నేసి డబ్బులు పెట్టి టికెట్లు కొనలేకపోతున్నారు. ఆ బండ్లను నమ్ముకొనే చిరు వ్యాపారులు, ఉద్యోగులు ప్రయాణం సాగించేవారు.
పుష్పుల్ ,కాకతీయ రైళ్లు రెండేళ్ల నుంచి లేకపోవడంతో వరంగల్ కాజీపేట, మహబూబాబాద్, కేసముద్రం ప్రయాణికులు ఖమ్మం, విజయవాడ వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చిన్నాచితక స్టేషన్లలో రైళ్లు ఆగకపోవడంతో ఎక్కడో దిగాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు వెంటనే స్పందించి పుష్పుల్, కాకతీయ రైళ్లను వెంటనే పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు.