Talasani Srinivas Yadav: రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు సరికాదు
Talasani Srinivas Yadav: అమీర్ పేట లో NTR విగ్రహం ఏర్పాటు చేస్తాం
Talasani Srinivas Yadav: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి విమర్శలు కురిపించారు. సనత్ నగర్ లో కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనమహోత్సవంలో తలసాని పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఏపీతో పాటు దేశానికి ఎంతో సేవ చేసిన చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్ ను తాను ఇంతకు ముందే ఖండించానని చెప్పారు. రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు సరి కాదని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం తీరు సరికాదని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదని చెప్పారు. అమీర్ పేటలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు తాను సిద్ధమని అన్నారు.