పార్లమెంటు ఉభయసభలను కుదిపేసిన అదానీ వ్యవహారం.. సోమవారానికి ఉభయ సభలు వాయిదా..
* అదానీ వ్యవహారంపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షాలు
Parliament: పార్లమెంటు ఉభయసభలను అదానీ రభస కుదిపేసింది. రెండో రోజు పార్లమెంటులో విపక్షాలు చేపట్టిన ఆందోళనలతో ఉభయసభలు దద్దరిల్లాయి. గౌతం అదానీ వ్యవహారం ఉదయం నుంచి పార్లమెంటు ఉభయసభలను కుదిపేయడంతో అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలో విపక్షాలు ఆందోళన చేశాయి. మార్కెట్లలో అదానీ గ్రూప్ డీలాపడడడంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎల్‌ఐసీ భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని అందుకే ఈ వ్యవహారంపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. ద్రవ్యోల్భణం, నిరుద్యోగం, అంశాలపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో ఉభయసభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితుల్లో స్పీకర్ ఓంబిర్లా లోక్‌సభను సోమవారానికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలో ఇదే పరిస్థితి నెలకొనడంతో చైర్మన్ ధన్‌కర్ సభను సోమవారానికి వాయిదా వేశారు.