Oxygen Concentrator: కాన్సంట్రేటర్ మిషన్లు కరోనా రోగులకు వరంగా మారాయి
Oxygen Concentrator: సాధారణంగా తెలంగాణకు వంద టన్నుల ఆక్సిజన్ అవసరం.
Oxygen Concentrator: కరోనా వేళ ప్రాణవాయువుకు అత్యంత డిమాండ్ ఏర్పడింది. దీంతో కాన్సంట్రేటర్ మిషన్లు కరోనా రోగులకు వరంగా మారాయి. సీరియస్‌గా ఉన్న కరోనా రోగికి ప్రాణవాయువు అందిస్తూ ఆయువును పోస్తుంది.
సాధారణంగా తెలంగాణకు వంద టన్నుల ఆక్సిజన్ అవసరం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మూడు వందల టన్నుల ప్రాణవాయువు అవసరం. అయితే కరోనా విశ్వరూపం చూపిస్తున్న వేళ రోజుకు ఆరు వందల టన్నులకిపైగా ఆక్సిజన్ అవసరం పడుతుంది. అటు కేంద్రం 260 టన్నుల ఆక్సిజన్ సప్లయ్ చేసిన కొరత తీరడం లేదు. దీంతో ప్రైవేట్ హాస్పిటల్స్‌కి వెళ్లిన కరోనా రోగులకు సకాలంలో ఆక్సిజన్ అందక చికిత్స జరగకుండానే ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇదిలా ఉండగా డిమాండ్‌ను బట్టి పలు రాష్ట్రాల మధ్య ఆక్సిజన్ సప్ల జరుగుతుంది. మరోపక్క ఆక్సిజన్ లేని రోజుల్లో యూస్ చేసిన కాన్సంట్రేటర్ మిషన్స్‌ను వైద్యులు ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. దీంతో ఈ మిషన్స్ కరోనా బాధితులకు వరంగా మారాయి. చూడటానికి చిన్నగా ఎయిర్ కూలర్ మాదిరా ఉన్నా రోగుల ప్రాణాలను కాపాడుతోంది. ఇక ప్రభుత్వాసుపత్రిల్లో ఆక్సిజన్ ఫ్లాంట్స్ ఉండటంతో ఎక్కువగా ఇబ్బందులు కనిపించడం లేదు.
ఇక ఈ కాన్సంట్రేటర్ మిషన్స్‌ను పొరుగు దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకోవాలి. అయితే ఈ మిషన్స్‌ను ఆర్డర్ చేసుకున్నా రావాడానికి నెలల సమయం పడుతుండటంతో సమస్య ఏర్పడుతోంది. సాధారణంగా కాన్సంట్రేటర్ మిషన్ ధర 50వేల రూపాయలు. కానీ కరోనా విజృంభిస్తుడటం, ఆక్సిజన్ సప్లై లేకపోవడంతో వీటి ధర ఇప్పుడు 80వేల రూపాయలకుపైనే పలుకుతోంది. మరోవైపు వైద్యులు కూడా రోగుల ప్రాణాలు కాపాడలేకపోతున్నామంటూ ఆవేదన పడుతున్నారు.