ఇకపై రాష్ట్ర బిడ్డలుగా అనాథలు.. తల్లీతండ్రి రాష్ట్ర ప్రభుత్వమే..
Orphans: తెలంగాణలో అనాధ పిల్లలందర్ని రాష్ట్ర ఆడబిడ్డలుగా గుర్తించాలని తెలంగాణ సబ్ కమిటీ నిర్ణయించింది.
Orphans: తెలంగాణలో అనాధ పిల్లలందర్ని రాష్ట్ర ఆడబిడ్డలుగా గుర్తించాలని తెలంగాణ సబ్ కమిటీ నిర్ణయించింది. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వమే తల్లీతండ్రి అని స్పష్టం చేసింది. అనాధలపై రాష్ర్ట గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలో కేబినెట్ కమిటీ సమావేశమయ్యింది. రాష్ట్రంలో అనాథల కోసం నిర్వహిస్తున్న అనేక అనాథ ఆశ్రమాలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి, వారి సలహాలు, సూచనలు తీసుకున్నామని మంత్రులకు వివరించారు.
అనాథల కోసం వచ్చిన ప్రతిపాదనల సమాహారాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. స్టేట్ హోం ఆవరణలో ఉన్న హోమ్స్ ను మంత్రి కేటీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఆశ్రయం పొందుతున్న చిన్నారులు మంత్రి కేటీఆర్ కు పూల మొక్కలు బహుకరించి ఘనంగా స్వాగతం పలికారు.