చెత్తా వ్యర్థాలతో... సేంద్రీయ ఎరువులు

Update: 2021-02-14 00:37 GMT

ఫైల్ ఇమేజ్

చెత్త, వ్యర్థాలను మనం ఎక్కడ అంటే పారేస్తూ ఉంటాం. లేదంటే చెత్తను ట్రాక్టర్ల ద్వారా ఊరి బయట డంపింగ్ యార్డులకు తరలిస్తారు. చెత్తే కదా అని అందరూ లైట్ తీసుకుంటారు. కానీ చెత్తా వ్యర్థాలతో సేంద్రీయ ఎరువులు తయారు చేస్తూ లాభాలు గడిస్తుంది ఆదిలాబాద్ లోని ముఖ్రా-కె గ్రామం. సేంద్రియ ఎరువులతో లక్షలాది రూపాయల లాభం గడిస్తోంది.

ముఖ్రా-కె గ్రామంలో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులో తడి చెత్త , పొడి చెత్తగా వేర్వేరు చేస్తారు. తడి చెత్తను 15 రోజుల పాటు డీ కంపోస్ చేస్తారు. తర్వాత అందులో వాన పాములను వదిలి సేంద్రియ ఎరువులను తయారు చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం 90 రోజుల పాటు కొనసాగుతుంది.

సేంద్రియ ఎరువుల తయారీ తర్వాత ప్లాస్టిక్ సంచుల్లో నింపుతారు. 50 కిలోల ప్యాకెట్ ను వెయ్యి రూపాయల ధరగా నిర్ణయించారు. ఇప్పటి వరకు 40 క్వింటాళ్ల సేంద్రియ ఎరువులను విక్రయించి 4 లక్షల రూపాయల లాభం ఆర్జించిన ముఖ్రా-కె.. రాష్టంలో సేంద్రియ ఎరువుల్లో లాభలను అర్జిస్తున్న మొదటి గ్రామంగా నిలిచింది.

రాబోయే రోజుల్లో మరిన్ని మార్గాల ద్వారా పంచాయతీకి ఆదాయాన్ని సమకూర్చుకునేలా ప్రణాలికలు సిద్ధం చేస్తున్నామని ముఖ్రా-కె సర్పంచ్ అంటున్నారు. దేశంలోనే ఆదర్శ గ్రామ పంచాయతీగా ముఖ్రా-కెను తీర్చిదిద్దటమే తమ లక్ష్యమంటున్నారు.

ఇప్పటికే ముఖ్రా-కె గ్రామం నూటికి నూరుశాతం బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా ఘనత సాధించింది. అలాగే నగదు రహిత లావాదేవీలు, నూరు శాతం మొక్కల పెంపకంలో అవార్డులు గెలుపొందింది. ఇప్పుడు చెత్తతో సేంద్రియ ఎరువును తయారుచేస్తూ దేశంలోని గ్రామ పంచాయతీలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. 

Full View


Tags:    

Similar News