Sabitha Indra Reddy: కేజీ టూ పీజీ వ‌ర‌కు జూలై 1 నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు

Sabitha Indra: డైరెక్ట్‌ క్లాసులు ఉండవని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.

Update: 2021-06-28 15:32 GMT

మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Sabitha Indra Reddy: డైరెక్ట్‌ క్లాసులు ఉండవని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. కరోనా ఉధృతి తగ్గని కారణంగా ఆన్‌లైన్‌లోనే క్లాసులు ఉంటాయని ఆమె వెల్లడించారు. జులై 1 నుంచి కేజీ టు పీజీ వరకు ఆన్‌లైన్‌లోనే క్లాసులు జరుగుతాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

విద్యాసంస్థల పున: ప్రారంభం, ఇతర అంశాలపై విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్షించారు. 46జీవోను ప్రైవేటు స్కూల్‌ యజమాన్యాలు తప్పనిసరిగా అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. కేవలం నెల వారి ఫీజులను మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు. ఇక ప్రవేశ పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పులు లేవని ఆమె స్పష్టం చేశారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు నిర్వహించే పరీక్షలను కూడా జులైలో నిర్వహిస్తామని మంత్రి సబితా క్లారిటీ ఇచ్చారు.

Tags:    

Similar News