లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన పెళ్లికొడుకు‌.. ఒకే పెళ్లి మండపంలో ఇద్దరికి మూడు ముళ్లు వేశాడు

Adilabad: ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ పెళ్లికొడుకు లక్కీ ఛాన్స్‌ కొట్టేశాడు.

Update: 2021-06-18 06:51 GMT

ఒకే పెళ్లి మండపంలో ఇద్దరికి మూడు ముళ్లు వేసిన పెళ్లికొడుకు

Adilabad: ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ పెళ్లికొడుకు లక్కీ ఛాన్స్‌ కొట్టేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక పెళ్లి చేసుకోవడమే కష్టంగా ఉన్న తరుణంలో ఆ యువకుడు మాత్రం ఒకే మండపంలో ప్రేమించిన ఇద్దరు యువతులను పెళ్లి చేసుకుని కొత్త చరిత్ర సృష్టించాడు. కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు చూస్తుండగానే ఈ పెళ్లి తంతు జరిగింది.

ఉట్నూర్‌ మండలం ఘనపూర్‌కు చెందిన అర్జున్‌ టీచర్‌ ట్రైనింగ్‌ పూర్తిచేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇక అదే సమయంలో తన మేనత్తల కూతుళ్లను ప్రేమించాడు అర్జున్‌. మూడేళ్లుగా ఉషారాణి, సూర్యకళతో ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం సాగించాడు. ఇక పెళ్లితో శుభం కార్డు వేయాలనుకున్న అర్జున్‌ ఇద్దరినీ పెళ్లి చేసుకుంటానని మూడు కుటుంబాల ముందు ప్రతిపాదన పెట్టాడు.

అర్జున్‌ ప్రతిపాదన విన్న మూడు కుటుంబాలు గ్రామపెద్దలను ఆశ్రయించాయి. అయితే వారు కూడా పెళ్లికి అంగీకరించడంతో ఈ నెల 14న ఘనపూర్‌లో ఆదివాసీల సంప్రదాయం ప్రకారం అర్జున్‌, ఉషారాణి, సూర్యకళ పెళ్లి జరిపించారు కుటుంబ సభ్యులు.

Full View


Tags:    

Similar News