Old woman infected with the corona: ఆసుపత్రికి రానంటూ కరోనా సోకిన వృద్ధురాలు హల్‌చల్
కరోనా సోకిన ఓ వృద్దురాలు చికిత్స కోసం ఆసుపత్రికి రానంటూ హల్‌చల్ చేసింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో చోటు చేసుకుంది.
Old woman infected with the corona : కరోనా సోకిన ఓ వృద్దురాలు చికిత్స కోసం ఆసుపత్రికి రానంటూ హల్‌చల్ చేసింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. శంకరపట్నం మండలంలోని ఓ గ్రామానికి చెందిన వృద్ధురాలికి ఇటీవల కరోనా నిర్ధారణ అయింది. అయితే చికిత్స కోసం ఆమెను అంబులెన్స్‌లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే తానూ ఆసుపత్రికి రానని, సిబ్బందితో వాగ్వాదానికి దిగింది.
అయితే చివరగా ఎలాగోలా అంబులెన్స్ ఎక్కిన ఆ వృద్ధురాలు మార్గమధ్యంలో మూత్ర విసర్జనకు వెళ్లాలని చెప్పి అంబులెన్స్ నుంచి దిగి అధికారుల నుంచి తప్పించుకొని తిరిగి మళ్ళీ శంకరపట్నంకి చేరుకుంది. అయితే ఆ వృద్దురాలు శంకరపట్నంలో బస్టాండ్ ఆవరణంలో ఉందని తెలుసుకున్న అధికారులు అంబులెన్స్ తీసుకెళ్లగా, తానూ ఆసుపత్రికి రానని మొరాయించింది. దాదాపుగా గంటసేపు అధికారులని ముప్పతిప్పలు పెట్టి చివరికి ఆసుపత్రికి వెళ్లేందుకు అంగీకరించింది. దీనితో అధికారులు ఉపిరి పీల్చుకున్నారు. ఆ వృద్దురాలిని కరీంనగర్ లోని ఆసుపత్రికి తరలించారు..
ఇక తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం నాటికి ఉన్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా రాష్ట్రంలో 1,640 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 52,466 కి చేరుకుంది. ఇందులో ప్రస్తుతం 11,677 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీనితో కోలుకున్న వారి సంఖ్య 40,334 కి చేరుకుంది. ఇక ఇవ్వాలా ఎనమిది మంది కరోనాతో మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 455 కి చేరుకుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు 15,367 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 3,37, 771కి చేరుకుంది.