Nominations: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం

Nominations: నామినేషన్స్ వేసేందుకు అభ్యర్థులు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు.

Update: 2021-04-18 04:28 GMT
Nominations Process In Siddipet Municipal Elections

Representational Image

  • whatsapp icon

Nominations: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం జోరందుకుంది. నామినేషన్స్ వేసేందుకు అభ్యర్థులు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. మున్సిపల్ కార్యాలయంలో 43 వార్డులకు గాను 9 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 152 మంది 169 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అభ్యర్థి తోపాటు మరో ఇద్దరిని మాత్రమే నామినేషన్ వేసేందుకు అధికారులు అనుమతి ఇస్తున్నారు.

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు కొనసాగింది. మొదటి రోజు కంటే ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఫస్ట్ డే 12 మంది 15 సెట్లు ధాఖలు చేయగా.... సెకండ్ డే 140 మంది అభ్యర్థులు 154 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా టీఆర్ఎస్ నుంచి 96 మంది నామినేషన్లు సమర్పించారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి 26, బీజేపీ నుంచి 25 మంది నామినేషన్లు వేశారు. నామినేషన్ల ధాఖలుకు ఇవాళ చివరి రోజు కావడంతో ఆశావాహులు పెద్ద ఎత్తున నామినేషన్స్ వేసే ఛాన్స్ కనిపిస్తోంది. 22న విత్ డ్రా...ఆ తర్వాత క్యాండేట్స్ ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తారు.30న పోలింగ్ జరుగనుంది.

పలు వార్డుల్లో పోటీ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆయా పార్టీలకు రెబల్స్ బెడద తప్పేట్లు లేదు. రెబల్స్ బెడద లేకుండా చేయాలని మంత్రి హరీష్ రావు పక్కా ప్లాన్ తో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసి అభ్యర్థుల ఎంపిక చేపట్టారు. గెలుపు గుర్రాలకు టిక్కెట్ దక్కేలా చర్యలు తీసుకున్నారు. అయినా కొన్ని చోట్ల ఆశావాహులకు టికెట్ వచ్చే ఛాన్స్ లేకపోవడంతో రెబల్ గా బరిలో దిగాడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్, బీజేపీ అన్ని వార్డుల్లో క్యాండిడేట్స్‌ను నిలిపేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. బీజేపీ 12 మందితో మొదటి జాబితా ప్రకటించగా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించాల్సి ఉంది.

Tags:    

Similar News