ఓటర్లు రాలే.. పోలింగ్‌ బూతుల్లో విశ్రాంతి తీసుకుంటున్న సిబ్బంది

గ్రేటర్ ఎన్నికల షెడ్యుల్ మొదలైనప్పటి నుంచి హడావుడి మామాలుగా లేదు. అన్ని పార్టీలు తమ సభలు సమావేశాలతో హోరేత్తించాయి. మేనిఫెస్టోలతో ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నో వాగ్దానాలను, హామీలను ఇచ్చాయి.

Update: 2020-12-01 11:47 GMT

గ్రేటర్ ఎన్నికల షెడ్యుల్ మొదలైనప్పటి నుంచి హడావుడి మామాలుగా లేదు. అన్ని పార్టీలు తమ సభలు సమావేశాలతో హోరేత్తించాయి. మేనిఫెస్టోలతో ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నో వాగ్దానాలను, హామీలను ఇచ్చాయి. ఇక పోలింగ్ సమయానికి వచ్చేసరికి మాత్రం ఓటర్లు మాత్రం కదిలి రావడం లేదు. తమ భవిష్యత్తును బలంగా తీర్చిదిద్దే ఓటు హక్కును గ్రేటర్ ప్రజలు వినియోగించుకోవడంలేదు. ఫలితంగా పలు పోలింగ్ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది టేబుళ్లపై ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వీపరీతంగా వైరల్ అవుతున్నాయి.

హైదరాబాద్ పాతబస్తీ యాకుత్‌పురా తలాబ్ చంచలంలో 44వేల 969మంద ఓటర్లు ఉన్నారు. అయితే మధ్యాహ్నం వరకు కేవలం 332మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ లెక్కన చూసుకుంటే ఒక్క శాతం మంది కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదన్నమాట. ఈ క్రమంలో ఓటర్లు లేకా పోలింగ్ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే నగర ప్రజల ఓటర్ల తీరుపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాయింత్రం 05 గంటల వరకు గ్రేటర్లో 30.5% పోలింగ్ జరిగింది. పోలింగ్ కి మరో గంట సమయం మాత్రమే ఉంది. 

Tags:    

Similar News