ప్రజల్లో మానవత్వం చనిపోయిందా..? సాటి మనిషి చనిపోతున్న పట్టించుకోవడం లేదా..? రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్న కనీసం ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయలేదు..? బస్సుల్లో ఉన్న జనం చోద్యం చూశారు..? భయపడి కొందరూ దూరం జరిగితే.. మరికొందరూ అక్కడే ఉండి సినిమాల్లో సీన్‌ను చూసినట్టు చూసి ఉండిపోయారు. దుండగులను అడ్డుకునే ప్రయత్నం ఎవరూ చేయలేదు.. ఇదీ హైకోర్టు న్యాయవాది వామన్‌రావు హత్య కేసులో జరిగిన దారుణం. అసలు సాటి మనిషి చనిపోతుంటే ఎందుకు స్పందించలేక పోయారు.
హైటెక్ యుగంలో అందరూ బిజీనే క్షణం తీరిక లేకుండా కష్టపడుతున్నారు. పక్కవాళ్లు ఎటు పోతే తమకేంటి అనే రీతిలో ఉన్నారు. అందుకే ఎదురుగా ఒక మనిషి చనిపోతుంటే చూస్తూనే ఉన్నారు కానీ, ఎవరూ అడ్డుకోలేదు. చుట్టూ జనం ఉన్న ఎవరూ పట్టించుకోలేదు. కత్తులతో విచక్షన రహితంగా నరుకుతూ ఉంటే ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. నిత్యం వందలాది వాహనాలు వెళ్లే రహదారి అది. వేలాది మంది ప్రయాణిస్తారు. సాటి మనిషి రక్తపు మడుగులో కొట్టుమిట్టులాడుతుంటే మనిషి చనిపోతుంటే మనవత్వం లేకుండా ప్రవర్తించారు. పదుల సంఖ్యలో జనాలు చూస్తుండగానే దంపతులిద్దరూ చనిపోయారు.
ఇదీ పెద్దపల్లి జిల్లా రామగిరి దగ్గర జరిగిన లాయర్ వామన్‌రావు, భార్య నాగమణిల దారుణ హత్య హైకోర్టు న్యాయవాదిగా ఉన్న వామన్‌రావు మంథని నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఆ సమయంలో రామగిరి మండలం కల్వచర్ల పెట్రోల్ బంకు ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి వారిపై దాడికి పాల్పడ్డారు. సాప్ట్‌గా కారులో వచ్చి తమ పని కానిచ్చి సాఫీగా అదే కారులో పారిపోయారు.
ఇదంతా సినిమాల్లోని సీన్‌లను చూసినట్టే చూశారు కానీ, ఎవరూ దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. భయంతో కొందరూ ధైర్యంతో కొంతమంది అక్కడే ఉండి పోయారు. దుండగులు వెళ్లిపోయిన తర్వాత వామన్‌రావును ఎవరూ కూడా ఆస్పత్రికి తరలించే ప్రయత్నం కూడా చేయలేదు. అయితే వామన్‌రావు అన్యాయంపై పోరాడడంతోనే హత్య చేశారు. పేదల పక్షాన మాట్లాడినందుకే పగబట్టీ మరీ ఖతం చేశారు.
ఆధునిక యుగంలో మనిషికి మానవత్వం లేకుండా పోయింది. తన స్వార్థం కోసమే మనిషి బతుకుతున్నాడు. మంచికి రోజులు పోయాయి. కళ్లముందే చంపేస్తున్నా కనీసం వారించే వారు లేకుండా పోయారు. అన్యాయంపై పోరాడితే చాలు చంపేస్తున్నారు. ప్రశ్నించినందుకు పొట్టన పెట్టుకుంటున్నారు. మనుషుల్లో ఇసుమంతైనా మానవత్వం లేకుండా పోయింది నడిరోడ్డుపై అంత జరుగుతుంటే ఒక్కరు ముందుకొచ్చి అడిగలేదు. రోడ్డుపై కొట్టుమిట్టులాడుతుంటే ఆస్పత్రికి చేరలేదు. కేవలం సాటి మనిషిపై కోపమొస్తే చంపేయడమేనా? కోర్టులున్నదెందుకు?