నిజామాబాద్ జిల్లాలో మిస్టరీగా ఖండ్‌గావ్ వీఆర్‌ఏ గౌతమ్ మృతి...
Nizamabad: పోలీస్ స్టేషన్ ఎదుట వీఆర్ఏ సంఘాల ఆందోళన...
Nizamabad: నిజామాబాద్ జిల్లాలోని ఖండ్‌గావ్‌కు చెందిన వీఆర్‌ఏ గౌతమ్ మృతి మిస్టరీగా మారింది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని పోలీసులు చెబుతుంటే.. ఇసుక మాఫియా కొట్టి చంపిందని మృతిని బంధువులు, ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు.. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ బోధన్‌లో ఆందోళనకు దిగారు.
కాగా.. ఖండ్‌గావ్ శివారులో ఉన్న మానేరు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న విషయంలో పలుమార్లు వీఆర్‌ఏ గౌతమ్‌కి, సాహెబ్ అనే వ్యక్తికి మధ్య గొడవ జరిగిందంటూ గౌతమ్ అక్క ఆరోపిస్తోంది. తనే కొట్టి చంపేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇక వీఆర్‌ఏ గౌతమ్ మరణం వెనుక ఇసుక మాఫియా ఉన్నట్టుగా ఆధారాలు ఏమి లేవంటున్నారు పోలీసులు. ఇసుక మాఫియా వల్లే గౌతమ్ చనిపోయినట్టు బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు ఇచ్చినప్పటికీ ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు దొరకలేదంటున్నారు పోలీసులు.
గౌతమ్ మర్డర్ కేసు విచారణ చేయకముందే ఇసుక మాఫియా హత్య చేయలేదని పోలీసుల ప్రకటనపై వీఆర్ఏ సంఘం నాయకులు మండిపడుతున్నారు. మృతుని కుటుంబసభ్యులకు పోలీసులు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.