నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌ను కలిసారు. నియోజకవర్గ సమస్యలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పసుపు రైతులకు సంబంధించిన దిగుమతులు బ్యాన్ చేశారని, ఎగుమతులు ప్రారంభమైనట్లు ఎంపీ తెలిపారు. అలాగే కొత్త వ్యవసాయ చట్టాలతో దళారీ వ్యవస్థ లేకుండా పోతుందన్నారు. కోల్డ్ స్టోరేజీల నిర్వహణకు కేంద్రం లక్ష కోట్ల నిధులు ఇస్తోందని ఈ స్కీమ్ నిధులను తెలంగాణ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ అరవింద్ కోరారు.