Nizam Sagar: నిండుకుండలా నిజాంసాగర్ ప్రాజెక్ట్.. గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
Nizam Sagar: కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. మహారాష్ట్ర, కర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు భారీగా చేరుతుండటంతో ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది.
Nizam Sagar: కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. మహారాష్ట్ర, కర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు భారీగా చేరుతుండటంతో ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. చాలా ఏళ్ల తర్వాత నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టంతో కనిపిస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 26 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా 3 గేట్లను ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేశారు.
ఈ మేరకు జలవనరులశాఖ అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.802 టీఎంసీలు). ప్రస్తుతం 1,404 అడుగులు (17.079టీఎంసీలు)కు చేరుకుంది. దీంతో మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.