Nirmal: వివాదాస్పదంగా మారిన నిర్మల్ మున్సిపల్‌లో ఉద్యోగాల భర్తీ

Nirmal: పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు

Update: 2022-05-27 12:35 GMT

Nirmal: వివాదాస్పదంగా మారిన నిర్మల్ మున్సిపల్‌లో ఉద్యోగాల భర్తీ

Nirmal Municipality Recruitment: నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో చేపట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. పోస్టుల భర్తీలో భారీగా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా ఉద్యోగ నియామకాలు జరిగాయని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక భర్తీ చేసిన పోస్టులను వెంటనే రద్దు చేయాలనే డిమాండ్లు వెలువెత్తుతున్న వేల నిర్మల్‌ మున్సిపాలిటీలో ఉద్యోగ నియామకాలపై హెచ్ఎం టీవీ స్పెషల్ స్టోరి.

నిర్మల్ మున్సిపల్ కార్యాలయం పారిశుద్ద విభాగంలో చేపట్టిన ఉద్యోగాల ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కమీషనర్ రాత్రికి రాత్రే బదిలీపై వెళ్లడం ఈ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఏడవ తరగతి అర్హత ఉన్న పబ్లిక్ హెల్త్ వర్కర్లు, ఆపీస్ సబార్డినెంట్స్, స్వీపర్ ఉద్యోగాలకు ఏకంగా ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్న 44 మంది అభ్యర్థులతో ఉద్యోగాల ప్రక్రియ పూర్తి చేయగా ఇందులో 50 శాతం ఉద్యోగాలను మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపాలిటీ ఉద్యోగులంతా కలిసి తమ బందువులకు కట్టపెట్టుకున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.

మున్సిపాలిటీలో అర్హత కలిగిన నిరుద్యోగులకు దక్కాల్సిన పారిశుద్ధ్య విభాగంలోని 44 ఉద్యోగాలను పెద్దలు గద్దల్లా తన్నుకుపోయారని స్థానికులు మండిపడుతున్నారు. గత ఏడాది నిర్మల్ మున్సిపల్ కమిషనర్ డిసెంబర్ 18న ఎల్ఆర్సీసీ 1/393/2021 ఆధారంగా మున్సిపల్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న 44 కిందిస్థాయి‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి అర్హత కలిగిన 880 మంది అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ ఉద్యోగాల భర్తీకి కాల్ లెటర్స్ సైతం పంపించారు. రోస్టర్ ప్రతిపాదికన మెరిట్ కం రిజర్వేషన్ ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 14న కలెక్టరేట్‌లో ఇంటర్వూలు చేపట్టారు అధికారులు. అయితే ఇంటర్వ్యూలకు హజరైన ఏ ఒక్క అభ్యర్థికి కూడా అవకాశం ఇవ్వకుండా 44 పోస్ట్‌లను అనర్హులతో భర్తీ చేశారనే ఆరోణలు తీవ్రమైయ్యాయి.

అయితే ఈ స్కాంలో కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డిపై బదిలీ వేటు పడగా ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనేది నిగ్గు తేల్చాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. భారీ ఎత్తున జరిగిన అక్రమాలపై విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Tags:    

Similar News