Niranjan Reddy: రైతుబంధును దశలవారీగా రూ.16వేలకు పెంచుతాం
Niranjan Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సాగునీటికి, కరెంట్‌కు ఢోకా లేదు
Niranjan Reddy: 10వేల ఉన్న రైతుబంధును 16 వేలకు దశల వారీగా పెంచుకుంటామని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాగునీటికి, కరెంట్‌కు ఢోకా లేదన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇస్తున్నామని తెలిపారు. అభివృద్ధిని చూడండి ఆలోచించి ఓటు వేయాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సిలిండర్ 400రూపాయలకే అందిస్తామన్నారు. భూమిలేని పేదలకు 5లక్షల కేసీఆర్ బీమా వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. వనపర్తి నియోజకవర్గం పెబ్బేరు మండలంలోని పాతపల్లి, అయ్యవారిపల్లి, తిప్పాయపల్లి, గుమ్మడం, గుమ్మడం తండా, చిన్న గుమ్మడం , యాపర్ల, బూడిదపాడు, ఈర్లదిన్నె , పెంచికలపాడు, మునగామన్ దిన్నె, జనంపల్లి, బున్యాదిపూర్, పాతసుగూర్ గ్రామాల్లో మంత్రి నిరంజన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.