New Revenue Act: ధరణి పోర్టల్ స్థానంలో త్వరలో కొత్త రెవెన్యూ చట్టం

భూమి చిక్కులు లేకుండా రైతుల కోసం ఆదర్శవమంమైన నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

Update: 2024-08-21 07:37 GMT

New Revenue Act: ధరణి పోర్టల్ స్థానంలో త్వరలో కొత్త రెవెన్యూ చట్టం

New Revenue Act: భూ రిజిస్ట్రేషన్ల పేరిట దందా చేస్తున్నారని... అవినీతిని అరికట్టేందుకు VRO వ్యవస్థను రద్దు చేసి ధరణి పోర్టల్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. అవినీతికి ఆస్కారం లేకుండా భూ రిజిస్ట్రేషన్లు జరుగుతాయని గత ప్రభుత్వం తెలిపింది. ధరణి పోర్టల్ లోపభూయిష్టకరంగా ఉందని తాము అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ హామి ఇచ్చింది. ఆ మేరకు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ధరణి పోర్టల్‌పై ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దేశానికి ఆదర్శంగా ఉండేలా కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తామని అంటోంది.

భూమి చిక్కులు లేకుండా రైతుల కోసం ఆదర్శవమంమైన నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. చట్టాలు సక్రమంగా చేయకపోతే... వాటి ఫలితాలు ఎలా ఉంటాయో గత ప్రభుత్వం తీసుకువచ్చిన రెవెన్యూ చట్టమే అందుకు నిదర్శనమని ఆరోపించారు. గతంలో మాదిరిగా కాకుండా ఒక రోజు ఆలస్యం అయినా సమస్యలను పరిష్కరించడంతో పాటు భవిష్యత్తు తరాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చట్టాన్ని రూపొందిస్తున్నామన్నారు. 23, 24 తేదీల్లో రెవెన్యూ ముసాయిదాపై జిల్లాల్లో వర్క్ షాప్‌లు నిర్వహించనుంది. ఆయా జిల్లాల్లో స్థానిక పరిస్థితులను బట్టి నూతన రెవెన్యూ చట్టం ముసాయిదాపై వివిధ రంగాల మేధావులతో వర్క్ షాప్ నిర్వహించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. LRS పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌లకు అప్పగించింది.

ఇదిలా ఉండగానే... ధరణి ధరఖాస్తుల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పది రోజుల్లోగా ప్రభుత్వం వద్దకు వచ్చిన అప్లికేషన్ల పరిష్కారానికి నిర్ణయం తీసుకుంది. ధరణి సమస్యలపై గత ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తులతో పాటు ఇటీవల కొత్తగా వచ్చిన అప్లికేషన్లను పదిరోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు. తిరస్కరించిన దరఖాస్తులకు సరైన కారణాలను తెలియజేయాలని సూచించారు. రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో దరఖాస్తులు అత్యధికంగా పెండింగ్‌లో ఉన్నాయని వాటిపై దృష్టి సారించాలని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్‌ను ఆదేశించారు. లక్షాలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే లే అవుట్ రెగ్యులరైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

LRS ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌ను పర్యవేక్షణ అధికారిగా నియమించాలని సీఎస్‌కి మంత్రి సూచించారు. LRS కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో అవసరమైన మేరకు డాక్యుమెంట్లు ఇవ్వకుంటే... ఇప్పుడు మళ్లీ తీసుకుని వాటిని LRS కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక యాప్‌లో అప్లోడ్ చేయాలన్నారు. ప్రతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద మొదటి దశలో వంద LRS దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు. ఇందులో ఎదురయ్యే మంచి చెడులను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవాలని అధికారులను సూచించారు.

Full View


Tags:    

Similar News