Hyderabad: భాగ్యనగరానికి పట్టుకున్న కొత్త భయాలేంటి..?
Hyderabad: కరోనాతో పోటీ పడుతోంది. నిశ్శబ్దంగా దాడి చేస్తోంది.
Hyderabad:కరోనాతో పోటీ పడుతోంది. నిశ్శబ్దంగా దాడి చేస్తోంది. ఊపిరితిత్తులను పట్టి పీడిస్తోంది. ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇప్పటికే ఎంతో నష్టం జరిగింది. వేలాది మంది ప్రాణాలను నులిమేసింది. అయినా మార్పు లేదు. జనాలు మారడం లేదు. ఇదే ఇప్పుడు హైదరాబాద్ ను కంగారు పెడుతోంది. భవిష్యత్ పై భయాన్ని రేపుతోంది. ఇలాంటి పరిస్ధితికి కారణమేంటి..? అసలే.. ఉన్న భయాలతో వణికిపోతున్న భాగ్యనగరానికి పట్టుకున్న కొత్త భయాలేంటి..?
కంట్రోల్ తప్పింది. పొల్యూషన్ పెరిగింది. చివరికి గుండెలను పిండి పిప్పి చేస్తోంది. కరోనా కంటే అతి ప్రమాదకరంగా మారుతోంది. డొక్కు వాహనాలు.. ఫ్యూయల్ కల్తీ.. తగలబెడుతున్న చెత్త.. పరిశ్రమలు వెలువరిస్తున్న కాలుష్యం. ఇలా చెప్పుకు పోతే అనేకం. మానవ తప్పిదాలే మారణహోమాన్ని సృష్టిస్తున్నాయి. కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి.
కలుషితమవుతున్న గాలి ప్రాణాంతకంగా మారుతోంది. చికిత్సలకు కూడా లొంగని మొండి వ్యాధులు ఎక్కువవుతున్నాయి. వీటన్నింటికి కారణాలు ఎన్నో. జరుగుతున్న విపరీత పరిణామాలు కూడా ఎన్నో. ప్రభుత్వాలు శుద్ధ ఇంధన వినియోగంపై దృష్టి పెట్టక పోతే మరిన్ని విపరీతాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.