Governor Tamilisai: నూతన విద్యా విధానంతో మెరుగైన ఫలితాలు వస్తాయి..
NEP Conference 2022: కొత్త ఎడ్యుకేషన్ పాలసీ వల్ల చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలంగాణ గవర్నర్ తమిళి సై అన్నారు.
NEP Conference 2022: కొత్త ఎడ్యుకేషన్ పాలసీ వల్ల చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలంగాణ గవర్నర్ తమిళి సై అన్నారు. హన్స్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా సదస్సులో పాల్గొన్న ఆమె కొత్త పాలసీ వల్ల డ్రాపౌట్స్ తగ్గుతాయని నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయన్నారు. విద్య ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనదని.. దేశ ఆర్థిక, సామాజిక అభివృద్దికి విద్య అనేది ఎంతో అవసరమన్నారు.
విద్యార్థులు డిగ్రీలు సాధించే యంత్రాలుగా కాకుండా స్కిల్డ్ బేస్ నాలేడ్జ్ ఇస్తుందన్నారు. జాబ్ ఆపార్చునిటీస్ పెరగడమే కాకుండా స్త్రీ, పురుషుల వంటి జెండర్ గ్యాప్ ను తగ్గిస్తుందన్నారు. కొత్త విద్యా విధానం వల్ల ఇతర భాషలు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.