Damagundam Forest: దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ కేంద్రానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శంకుస్థాపన

Update: 2024-10-15 08:52 GMT

Navy's VLF Radar Station: దామగుండం అటవీ ప్రాంతంలో ఇవాళ భారత నౌకాదళానికి చెందిన వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యునికేషన్ ట్రాన్స్‌మిషన్ స్టేషన్ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. రక్షణ శాఖ మంత్రి, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ భూమిపూజ కార్యక్రమం జరిగింది. అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రాడార్ స్టేషన్ నిర్మాణం కోసం వికారాబాద్ జిల్లా పూడురు మండలం పరిధిలోని దామగుండం రిజర్వ్ ఫారెస్టులో 2900 ఎకరాలను దాదాపు 6 నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించింది. విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తోన్న ఈస్టర్న్ నేవీ కమాండ్ ఈ రాడార్ స్టేషన్ నిర్మాణం పనులను పర్యవేక్షించనుంది. 

రాడార్ స్టేషన్ నిర్మాణంలో భాగంగా అక్కడ పనిచేయబోయే సిబ్బంది అవసరాల కోసం దామగుండం అటవీ ప్రాంతంలో భారీ టౌన్‌షిప్ నిర్మాణం జరగనుంది. ఈ టౌన్‌షిప్‌లోనే వారికి కావాల్సిన పాఠశాలలు, ఆస్పత్రి, బ్యాంక్, షాపింగ్ కాంప్లెక్స్, క్రీడా ప్రాంగణాలు, పార్కులు ఏర్పాటు కానున్నాయి.

14 ఏళ్లుగా రాడార్ స్టేషన్ ఏర్పాటు కోసం ఇండియన్ నేవీ ప్రయత్నాలు

14 ఏళ్లుగా రాడార్ స్టేషన్ ఏర్పాటు కోసం ఇండియన్ నేవీ ప్రయత్నాలు చేస్తోంది. 2010-2023 మధ్య కాలంలో అప్పటి ప్రభుత్వ పెద్దలతో రాడార్ స్టేషన్ ఏర్పాటు కోసం పలు సందర్భాల్లో నేవీ సంప్రదింపులు జరిపింది. కానీ వివిధ కారణాలతో ఆ చర్చల్లో ముందడుగు పడలేదు.

రేవంత్ రెడ్డి వచ్చాకే..

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకా ఈ ప్రాజెక్టుపై దృష్టిసారించినట్లు బిజ్ బజ్ కథనం స్పష్టంచేసింది. అందులో భాగంగానే అటవీ శాఖ ఈ జనవరి 24న కేంద్రానికి 2900 ఎకరాల స్థలం అప్పగించింది. స్థలం కేటాయింపులు పూర్తవడంతో దామగుండంలో రాడార్ స్టేషన్ ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు విశాఖపట్నంలోని ఈస్టర్న్ నావల్ కమాండ్ రంగంలోకి దిగింది.

Tags:    

Similar News